తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా సభలో బీఆర్ఎస్ హయాంలో వేసిన రోడ్ల పరిస్థితిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా.. స్పీకర్ గడ్డ ప్రసాద్ కల్పించుకుని కొత్త సమస్యను తెరపైకి తీసుకొచ్చారు. ఈ సమస్య విని.. అప్పటివరకు హాట్ హాట్‌గా సాగిన సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.