Minister Satya Kumar Yadav: ప్రొద్దుటూరు పేరు చెబితే తనకు ఎంతో ఎమోషన్ అన్నారు మంత్రి సత్యకుమార్. తాను పుట్టిన పెరిగిన ప్రొద్దుటూరుతో 50 ఏళ్లుగా అనుబంధం ఉందని.. తన తండ్రి ఒక లారీ డ్రైవర్‌గా ఉండేవాడని, తాను అనంతపురం జిల్లా గడేకల్లులో జన్మించినా ప్రొద్దుటూరులోనే తన విద్యాభ్యాసం కొనసాగిందన్నారు. కేవలం సిద్ధాంతాన్ని నమ్మడంతో బీజేపీ తనను ఈ స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు. తనను ఎన్నుకున్న ధర్మవరం నియోజకవర్గంతోపాటు తాను పెరిగిన ప్రొద్దుటూరుకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.