గుంటూరు మిర్చి యార్డులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు.. అక్కడ రైతుల్ని పరామర్శించారు. చంద్రబాబు సర్కార్ తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎల్లకాలం మీరే ఉండరు.. మళ్లీ మేం వస్తా' అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన్ని పండగలా చేశామని.. కూటమి ప్రభుత్వంలో రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. మిర్చి రైతులకు కనీసం మద్దతు ధర కూడా దక్కడం లేదన్నారు.