Macherla Municipality TDP: మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరింది. పురపాలక సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సహా 14 మంది కౌన్సిలర్లు ఇటీవల వైెఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ చేరారు. మాచర్లలో గత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. కూటమి అధికారంలోకి వచ్చాక మాచర్లలో రాజకీయం మారింది. మొత్తం 31 మంది కౌన్సిలర్లకు గాను ఇటీవల 14 మంది టీడీపీలో చేరారు. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్ చిన్న ఏసోబు, వైస్‌ఛైర్మన్ పోలూరి నరసింహారావు టీడీపీలో చేరారు. దీంతో ఎక్స్‌అఫీషియో సభ్యులు ఇద్దరితో కలిపి టీడీపీ బలం పెరిగింది. శుక్రవారం ఛైర్మన్ పదవి టీడీపీకి ఏకగ్రీవమైంది. ఇప్పటివరకు వైస్‌ఛైర్మన్‌గా ఉన్నపోలూరి నరసింహారావును ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.