వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కీలక పదవి అప్పగించారు. వైసీపీ అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్‌ను నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి హిందూపురం ఎంపీగా గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు గోరంట్ల మాధవ్‌కు అవకాశం లభించలేదు.