మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. 1999లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2010లో వైసీపీలో చేరిన ఆయన.. 2014లో వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండేళ్లకే టీడీపీలో చేరారు. ఆ తర్వాత మరోసారి వైసీపీ గూటికి చేరారు.