Roop Kumar Yadav On Anil Kumar Yadav: నెల్లూరు జిల్లాను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నాశనం చేశారని మండిపడ్డారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్. సామాన్య కార్యకర్తల చెమటతో అనిల్ రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి అయ్యారన్నారు. జిల్లాను వదిలి పల్నాడు వెళితే అక్కడ ప్రజలు తరిమికొట్టారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను జనసేన పార్టీలోకి వెళ్లమని అనిల్ చెబుతున్నారని.. సొంత పార్టీకి ఆయన వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు.