మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మెడికల్ కాలేజీ పీజీ సీట్ల వ్యవహారంలో ఈ నోటీసులు ఇచ్చింది. గతేడాది జూన్‌లో మల్లారెడ్డికి చెందిన మెడికల్ కాలేజీలు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పలు డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.