పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంఘసేవకురాలు సునీతా కృష్ణన్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును ఆయన కార్యాలయంలో కలిసిన సునీతా కృష్ణన్ తన జీవితచరిత్ర పుస్తకాన్ని ఆయనకు అందించారు. అలాగే మానవ అక్రమ రవాణా మీద ఆయనతో చర్చించారు. ఈ సమస్యపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని చంద్రబాబు సహకారం కోరారు. అయితే ఇటీవలే సీఎం అపాయింట్‌మెంట్ కోరుతూ సునీతా కృష్ణన్ ట్వీట్ చేయగా.. చంద్రబాబు వెంటనే అపాయింట్‌మెంట్ ఖరారు చేశారు.