కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ పెండింగ్ పనులు, నిర్వాసితుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల పక్షాన రేవంత్ రెడ్డి పోరాడిన విషయాన్ని గుర్తు చేసిన హరీష్ రావు.. మరి అధికారంలోకి వచ్చాక ఎప్పుడెప్పుడు మెరుగైన పరిహారం చెల్లిస్తారా అని నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారని లేఖలో హరీష్ రావు చెప్పుకొచ్చారు.