రైతులను మోసం చేస్తున్న 34 మంది దళారులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో.. పోలీసులు రైతుల వేషంలో 9 మండలాల్లో ఆపరేషన్ చేపట్టారు. కొందరు దళారులు పంట రుణాలు ఇప్పించి వాటిపై రూ. 5-10 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దళారుల ఆట కట్టించారు.