Markapuram Pension Money: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో పింఛన్లు పంపిణీ చేయాల్సిన డబ్బులతో సచివాలయ ఉద్యోగి మాయం అయ్యారు. శనివారం డబ్బులు పంపిణీ చేసేందుకు శుక్రవారం రాత్రి అధికారుల దగ్గర సంతకం చేసి డబ్బులు తీసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం అయినా సరే పింఛన్ డబ్బులతో ఉద్యోగి కనిపించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ నారాయ ణరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది.