Markapuram Railway Station Passengers Trapped: ప్రకాశం జిల్లా మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్‌లో హైడ్రామ కనిపించింది. కొందరు భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి నుంచి రైల్లో వచ్చి మార్కాపురం స్టేషన్‌లో దిగారు. రైల్వే స్టేషన్‌లో ఆదివారం వేకువజామున 4 గంటలకు ప్లాట్‌ఫాం నుంచి బయటకు వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కారు. అది మధ్యలో మొరాయించడంతో ఇరుక్కుపోయారు. వెంటనే రైల్వే పోలీసులు మూడు గంటలపాటు శ్రమించి వారిని బయటకు తీశారు. లిఫ్టులో ఇరుక్కుపోయిన 14 మంది ప్రయాణికులు మూడు గంటలపాటు ఇబ్బందిపడ్డారు.