ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్.. అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఈ ప్రమాద విషయం తెలిసి.. తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, సినీ ప్రములు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా.. తెలంగాణ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌కు అండగా నిలిచారు.