ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతులను ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద తగ్గిన మిర్చి ధరను భర్తీ చేసేలా చూడాలని చంద్రబాబు కోరారు. అలాగే సాగు కోసం అవుతున్న ఖర్చును, విక్రయధరకు ఉన్న తేడాను గుర్తించాలన్నారు. 50 శాతం నిష్పత్తిలో కాకుండా పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తూ మిర్చి కొనుగోలు చేయాలని చంద్రబాబు నాయుడు లేఖలో కోరారు.