తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూముల వ్యవహారం ఇటు రాజకీయాల్లోనూ అగ్గిరాజేసింది. అయితే.. ఈ వివాదంలో హెచ్సీయూ విద్యార్థులు, పర్యావరణవేత్తలు ముందుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడ్డారు. ఈ క్రమంలో.. వారి ధైర్యం, పట్టుదలను మెచ్చుకుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక లేఖ రాశారు.