మీ ఫోన్‌కి అలాంటి మెసేజ్ వచ్చిందా..? ఒక్క క్లిక్‌తో డబ్బు మాయం: రాచకొండ పోలీస్

9 months ago 19
సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. 80 శాతం సైబర్ నేరాలు మొబైల్ ఫోన్‌ల ద్వారానే జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మెసేజ్‌ల చివర T/ S/ P/ G అక్షరాలుంటే నమ్మొద్దని హెచ్చరించారు. తెలియని లింక్‌లను క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ప్రతి మెసేజ్‌ను తెరిచే ముందు ఆలోచించాలని సూచించారు.
Read Entire Article