బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం అవుతారని ఎరుకల నాంచారమ్మ సోది జోస్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సొంత పార్టీ నేతల దుష్ప్రచారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ ఈ జోస్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ నేత రాంమోహన్ రెడ్డి ఈ జోస్యాన్ని ప్రచార స్టంట్ అని విమర్శించారు. కవిత తాను సీఎం కావాలనే ఆకాంక్షను పరోక్షంగా బయటపెట్టారని ఆరోపించారు.