మీర్‌పేట భార్యను చంపి ముక్కలుగా చేసిన కేసులోరోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. గతంలో చూసిన ఓటీటీ వెబ్‌సిరీస్‌ల ప్రేరణతో భార్య మృతదేహాన్ని ముక్కలు చేసి సాయంత్రానికి మాయం చేశాడు నిందితుడు గురుమూర్తి. దుర్వాసన రాకుండా అవసరమైన కెమికల్స్ కోసం యూట్యూబ్ వీడియోస్ చూశాడట. దానికి తోడు గత రెండేళ్ల క్రితం హైదరాబాద్ చైతన్యపురిలో జరిగిన నర్సు హత్య ఉందంతాన్ని ప్రేరణగా తీసుకొని దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది.