వినాయకచవితి సమీపిస్తున్న వేళ.. సంబంధిత శాఖలతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈసారి హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు.. ముంబైతో సమానంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే.. అటు అధికారులకు ఇటు నిర్వాహకులకు మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలంతా సహకరిస్తేనే.. గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవచ్చని.. ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.