Raj Tarun Case Updates: రాజ్ తరుణ్- లావణ్య వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. గతంలో రాజ్ తరుణ్ మీద లావణ్య పెట్టిన కేసుపై విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు.. కీలక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే.. రాజ్ తరుణ్‌ను నిందితునిగా తేల్చుతూ.. కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఇంతలోనే.. లావణ్య ముంబైకి వెళ్లి.. రాజ్ తరుణ్‌ను హీరోయిన్ మాల్వి మల్హోత్రతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు చెప్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా విడుదల చేసింది.