ముంబైలో రూ.24 లక్షల చోరీ.. హైదరాబాద్‌లో మహిళ ఆందోళన..

1 year ago 23
హైదరాబాద్‌ రాజ్‌భవన్‌ ఎదుట నాగమణి అనే మహిళ ఆందోళన సృష్టించింది. గవర్నర్‌ను కలవడానికి అనుమతి లభించకపోవడంతో ఆమె నిరసనకు దిగింది. ముంబైలోని తన ఇంటిలో రూ.24 లక్షల సొమ్ము పోయిందని.. హైదరాబాద్‌లోని బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది. గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో పోలీసులు ఆమెను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమె మానసిక స్థితిపై అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు.
Read Entire Article