Chandrababu Naidu Car Driver Death: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌లోని కారు డ్రైవర్ చనిపోయారు. ఉండవల్లిలోని సీఎం నివాసం దగ్గర హెడ్‌కానిస్టేబుల్ మహ్మద్ అమీన్ మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉన్నారు. అయితే ఆయన ఉన్నట్టుండి తీవ్రమైన ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది హుటాహుటిన తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. అమీన్ మరణంపై చంద్రబాబు సంతపాన్ని తెలియజేశారు.