మూసీ నదిలోకి మురుగు ప్రవాహాన్ని అరికట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టింది. రూ. 3,100 కోట్లతో రెండు దశల్లో ట్రంక్ లైన్లు నిర్మించనున్నారు. 80 శాతం మురుగు మూసీలోకి చేరుతుండటంతో.. 39 అదనపు ఎస్టీపీలను నిర్మించనున్నారు. నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరం, దక్షిణం వైపు ట్రంక్ లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం మూసీ నదిలోకి నేరుగా మురుగు నీరు వదలడం వల్ల శుద్ధి కేంద్రాల లక్ష్యం నెరవేరడం లేదు. ట్రంక్ లైన్లు నిర్మించడం ద్వారా మురుగు నీటిని సేకరించి.. శుద్ధి కేంద్రాలకు తరలించి, శుద్ధి చేసిన నీటిని మాత్రమే నదిలోకి వదులుతారు.