మూసీ ప్రక్షాళనను ఒక యజ్ఞంలా భావిస్తున్నామని దీనిని అడ్డుకునే వారు ప్రజల ఆగ్రహానికి గురవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాలుష్య రహిత మూసీ ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 8 ఎకరాల్లో నిర్మించే ఈ క్షేత్రంలో 100 అడుగుల శివుడి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కాగా, ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.