Heart Attack: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కూరావుపేట గ్రామంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన మేనమామ కొడుకు వివాహానికి వచ్చిన 23 ఏళ్ల సంజీవ్ అనే కుర్రాడు.. రెండు రోజులుగా పెళ్లింట హుషారుగా గడిపాడు. వివాహం అనంతరం రాత్రిపూట నిర్వహించిన బరాత్‌లో డ్యాన్స్ చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పరీక్షించిన వైద్యులు.. గుండెపోటుగా నిర్ధారించారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.