హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామానికి చెందిన రాకేష్ అనే బాలుడు అరుదైన 'సూడో మస్క్యులర్ డిస్ట్రొఫి' వ్యాధి సోకి నడవలేని స్థితికి చేరుకున్నాడు. వైద్యం కోసం తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం మరింత డబ్బు అవసరం కాగా.. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ఆదుకొని తమ బిడ్డకు ప్రాణం పోయాలని వేడుకుంటున్నారు.