మెగాస్టార్ చిరంజీవికి టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ విషెస్ చెప్పారు. సినిమా రంగానికి, సమాజానికి చిరంజీవి చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిడ్జ్ ఇండియా తరఫున జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. చిరంజీవికి వీసీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయ సెలెబ్రిటీగా చరిత్ర సృష్టించారంటూ చిరంజీవిని సజ్జనార్ కొనియాడారు.