రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. డ్రగ్స్ పార్టీ నిర్వహణ, నేరుగా ప్రమేయం ఉన్న ఆరోపణల నేపథ్యంలో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తూ.. సంతృప్తికరమైన సమాధానం రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.