మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చీమలు పట్టి, ముళ్లు గుచ్చుకుని.. ఒళ్లంతా రక్తంతో ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన చిన్నారి కనిపించటం.. అందరినీ కలిచివేసింది. అటుగా వెళ్లిన ఓ ఆటో డ్రైవర్‌కు ఆ చిన్నారి ఏడుపు వినపడటంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించి.. తల్లిదండ్రుల గురించి ఆరా తీయగా.. శిశువు చనిపోయిందనుకుని పడేసినట్టుగా చెప్పినట్టు సమాచారం. మొత్తానికి ఆ శిశువు మళ్లీ తల్లి చెంతకు చేరింది.