తెలంగాణలో రాజకీయమంతా తెలంగాణ తల్లి విగ్రహం చుట్టే తిరుగుతోంది. ఇన్ని రోజులు ఉన్న విగ్రహాన్ని కాదని.. తెలంగాణ తల్లికి కొత్త రూపునిచ్చి.. సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలోనే.. అసలు తెలంగాణ తల్లి విగ్రహం మొట్టమొదట ఎప్పుడు ఎవరు ఎక్కడ ఆవిష్కరించారు. ఆ మొట్టమొదటి విగ్రహం ఎలా ఉండేది అన్న ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఆ తొలి తెలంగాణ తల్లి విగ్రహానికి.. ఇప్పుడు ఆవిష్కరించే కొత్త విగ్రహానికి ఏమైనా పోలికలున్నాయా..?