ఎత్తయిన కొండలు.. దట్టమైన అడవి.. లోతట్టు ప్రాంతాలు.. సహజసిద్ధ జలపాతాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. అడ్వెంచర్.. ఆహ్లాదం కలగకలిసిన ప్రయాణం.. అదే నాగర్ కర్నూర్ జిల్లాలోని.. సలేశ్వర లింగమయ్య జాతర. దక్షిణాది అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య జాతర ప్రారంభమైంది. శుక్రవారం (ఏప్రిల్ 11) రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ జాతర సాగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతించనున్నారు. మరి ఈ అడ్వెంచర్ ప్రయాణం గురించి పూర్తి వివరాలు ఇవిగో..!