కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఎప్పటికైనా తెలంగాణకు సీఎం అవుతానంటూ చెప్పే జగ్గారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదంటూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తన భార్య గానీ.. ఆంజనేయులు గానీ పోటీ చేస్తారంటూ కీలక ప్రకటన చేశారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కూడా మాట్లాడతానని చెప్పుకొచ్చారు.