బైక్ పైనుంచి పడిపోతున్న యాక్ట్ చేశాడు.. సాయం చేయడానికి ఒక పెద్దాయన వచ్చాడు.. వెనకాలే ఇంకో కుర్రాడు వచ్చి సాయం చేశాడు.. నైస్‌గా పెద్దాయన జేబులో ఫోన్ కొట్టేశాడు.. టాలెంటమ్మా.. టాలెంటు..!. తిరుపతిలోని ఆటోనగర్‌లో పట్టపగలు దొంగతనం జరిగింది. పల్సర్ బైక్‌పై ఇద్దరు దొంగలు వచ్చారు. ఒక కుర్రాడు ముందుగా బైక్ దిగి దూరంగా వెళ్లిపోగా.. బైక్ స్కిడ్ అవుతుందని సాయం చేమని మరో యువకుడు కోరాడు. ఓ పెద్దాయన సాయం చేయడానికి బైక్ వద్దకు వచ్చాడు. పెద్దాయనతో మాట్లాడుతుండగా బైక్ వద్దకు మరో కుర్రాడు వచ్చాడు. బైక్‌ను పైకి లేపుతున్నట్టు నటిస్తూ నైస్‌గా పెద్దాయన జేబులో ఫోన్ కొట్టేసి పరారయ్యారు.కాసేపటి తర్వాత జేబులో ఫోన్ లేదని పెద్దాయన గమనించారు. ఈ వీడియో మొత్తం దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యిది. . బాగా వైరల్ అవుతోంది.