మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఘటనలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్.. టీడీపీ అధిష్టానానికి తన వివరణ తెలియజేశారు. ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌ను టీడీపీ అధిష్టానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం రాత్రి పుట్టా మహేష్ లిఖితపూర్వకంగా తన వివరణ తెలియజేసినట్లు సమాచారం. అయితే పుట్టా మహేష్ వివరణను తెలుగుదేశం పార్టీ అధిష్టానం రహస్యంగా ఉంచుతున్నట్లు తెలిసింది. ఈ వివరణ ఆధారంగా ఏలూరు ఎంపీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.