మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ కేసులో తమ ప్రమేయం ఏం లేదని తేల్చి చెప్పారు. నిబంధనల ప్రకారమే.. ఈ కేసులో పలువురికి స్టేషన్ బెయిల్ మంజూరైనట్లు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో టీడీపీ ఎంపీకి బెయిల్ రావడంపై వస్తున్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.