తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులకు తీపి కబురు. ఆలయానికి సమీపంలోని రాయగిరి చెరువు వద్ద రెండెకరాల్లో అభివృద్ధి చేసిన మినీ శిల్పారామం రేపట్నుంచి అందుబాటులోకి రానుంది. రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన పల్లె వాతావరణం, ఫుడ్‌కోర్టు, బోటింగ్, రాత్రిపూట లైటింగ్ శిల్పారామానికి వచ్చే వారికి ప్రత్యేక అనుభూతిని ఇవ్వనున్నాయి.