యాదగిరిగుట్టలో కొబ్బరికాయ ధరల్లో మార్పులు..? ఒక్కో కాయ ఎంతో తెలుసా..

9 months ago 23
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కొండపైన విక్రయించే కొబ్బరికాయల ధరను పెంచాలని వర్తక సంఘం ఆలయ ఈవో వెంకటరావును కోరింది. ప్రస్తుతం రూ.40కి అమ్ముతుండగా... బయటి మార్కెట్‌లో ధరలు పెరగడం, ఆలయానికి నెలకు రూ.4 లక్షల భారీ కిరాయి చెల్లించడం వలన నష్టపోతున్నామని వర్తక సంఘం అధ్యక్షుడు మాధవులు గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు రూ.50కి విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈవో హామీ ఇచ్చారు.
Read Entire Article