Sankalpa Snanam in Yadagirigutta: యాదాద్రి భక్తులకు శుభవార్త వినిపించారు అధికారులు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా.. కొండ పైనున్న పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేయటాన్ని నిషేధించగా.. మళ్లీ ఆ అదృష్టాన్ని భక్తులకు కల్పించేందుకు సంకల్పించారు. ఆగస్టు 11వ తేదీ నుంచి కొండపైనే విష్ణు పుష్కరిణిలో భక్తులకు స్నానాలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో.. పదేళ్ల తర్వాత భక్తులకు పుష్కరిణిలో స్నానం చేసే అదృష్టం దొరకనుంది. అయితే.. ఇందుకోసం టికెట్‌ను పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు.