తెలంగాణలోని యువత కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త పథకాన్ని ప్రారంభించింది. సుమారు రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ పథకాన్ని మార్చి 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం కింద.. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ది చేకూరనుండగా.. ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు లోన్ ఇవ్వనుంది ప్రభుత్వం. అయితే.. ఈ లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఏఏ డాక్యుమెంట్లు అవసరం అనేది తెలుసుకోండి.