యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్ తగిలింది. మరోసారి హర్షసాయిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఓ సారి తెలుగు నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా.. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసారి మాత్రం తాను గతంలో వివాదాల్లో ఇరుక్కున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్లే. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేయగా.. సైబరాబాద్ పోలీసులు స్పందించిన కేసు నమోదు చేశారు.