ఏదైనా వ్యసనంగా మారిందంటే.. దానిని మానడం చాలా కష్టం. మద్యపానం నుంచి జూదం వరకు ఏదైనా అలవాటు అయిందంటే.. దాని నుంచి దూరంగా వెళ్లాలంటే.. ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిలో ముఖ్యంగా జూదం ఒకటి. సరదాగా ప్రారంభమయ్యే ఇది చివరకు ప్రాణాల మీదకు తెస్తుంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ లో బెట్టింగ్ యాప్‌లు ఎక్కువయ్యాయి. వాటికి అలవాటు పడిన వారు అప్పులు చేసి రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని ఐపీఎస్ అధికారి సజ్జనార్ ట్వీట్ చేశారు.