తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వవిద్యాలయాల్లో మార్కెట్‌లో డిమాండున్న కోర్సులను బోధించాలని సూచించారు. ప్రైవేట్ యూనివర్సిటీలతో పోటీ పడటానికి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మార్పులు చేపట్టాలని, కొందరు ప్రొఫెసర్లకు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు అప్పగించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇవి తప్పనిసరని చెప్పారు.