Pawan Kalyan Speech In Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్ర 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులతో రికార్డు సృష్టిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.