దేశమంతా హోలీ సంబురాల్లో మునిగి తెలుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులంతా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాత్రం ప్రత్యేకంగా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్తూనే.. రంగు పడుద్ది అంటూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లకు తనదైన స్టైల్‌లో మాస్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్.