రన్నింగ్ కారులో మంటలు.. తృటిలో తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే కుమారుడు

1 year ago 37
ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ కుమారుడు ప్రవీణ్‌గౌడ్ కుటుంబం పెను ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడింది. ఆదివారం రాత్రి ఉప్పల్ రింగ్ రోడ్డుపై వారు ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రవీణ్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు వెంటనే అప్రమత్తమై కారు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. షాపింగ్ కోసం ఉప్పల్ ఐడీఏ వెళ్లొస్తుండగా ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే కారు పూర్తిగా కాలిపోయింది.
Read Entire Article