తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల క్రితమే ఓ బస్సు రన్నింగ్‌లో ఉండగానే.. రెండు టైర్లు ఊడిపోగా.. ఇప్పుడు ఓ రన్నింగ్ బస్సు స్టీరింగ్ విరిగిపోయింది. ప్రమాద సమయంలో 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటంతో.. ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. ప్రమాద స్థలానికి కొద్ది దూరంలోనే వాగు కూడా ఉండటం గమనార్హం.