రాఖీ పౌర్ణమి తెలంగాణ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. రికార్డు స్థాయిలో ప్రయాణాలు సాగించగా.. ఆదాయం కూడా అంతే స్థాయిలో వచ్చింది. నిన్న ఒక్కరోజే 63.86 లక్షల మంది రాకపోకలు సాగించారు. సంస్థకు రూ.32 కోట్ల ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం వెల్లడించారు.