KTR Rakhi: మహిళా కమిషన్ కార్యాలయంలో కేటీఆర్‌కు రాఖీలు కట్టిన సభ్యులపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టొచ్చు గానీ.. సభ్యులు కేటీఆర్‌కు రాఖీ కడితే తప్పా అని బీఆర్‌ఎస్ అభిమానులు నిలదీస్తున్నారు. ‘రాఖీకి కూడా భయపడితే ఎలా?’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.