రాచకొండ కమిషనర్ పరిధిలో ఇద్దరు రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. రాచకొండ కమిషనరేట్ చరిత్రలో ఇలా నగర బహిష్కరణ చేయటం ఇదే మొట్టమొదటిసారి అని సీపీ వెల్లడించారు. సురేందర్ అలియాస్ సూరితో పాటు రాజేశ్ అలియాస్ మెంటల్ రాజేశ్ పేరుతో చలామణి అవుతున్న ఇద్దరు రౌడీ షీటర్లను నగర బహిష్కరిస్తున్నట్టు సీపీ సుధీర్ బాబు తెలిపారు. వీరిద్దరు నగరంలో కనిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.